మెదక్, అక్టోబర్ 17 (నమస్తేతెలంగాణ): కా టన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వా రా పత్తి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై గురువారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి మారెటింగ్, సహకార, సీసీఐ, పోలీస్, అగ్నిమాపక, వ్యవసాయ కాటన్ మిల్లుల యజమానులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ మొదటి వారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలకు రానున్నదని, జిల్లాలో 36,142 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేయాలన్నారు.
ఈనెల 25వ తేదీ వరకు సెంటర్లు ఓపెన్ చేయాలని, రోజూ ఉదయం 9 గంటల నుండి సాయం త్రం 6 వరకు కొనుగోళ్లు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని, మా యిచ్చర్ మిషన్లు, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కేం ద్రాల్లో స్థానిక పోలీస్ అధికారుల నంబర్లు, అత్యవసర నంబర్లు ఏర్పాటు చేయాలని సూ చించారు.
తూనికలు కొలతలు శాఖ ద్వారా ప్రతి కొనుగోలు కేంద్రంలో కాంటాలకు స్టాం పింగ్ చేయాలని, గోదాములు, మిల్లుల వద్ద అగ్నిమాపక శాఖ ద్వారా తగిన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. cotally యాప్ను రైతులు డౌన్లోడ్ చేసుకోవాలని, రైతుల ఖాతాల్లో ఈ యాప్ ద్వారా డబ్బులు తెలుసుకోవచ్చని సూచించారు. మద్దతు ధర క్వింటాలుకు రూ. 7521గా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో మారెటింగ్ అధికారి యాద య్య, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, అగ్నిమాపక అధికారి వేణు, లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్, జిల్లా రవాణా అధికారి జి.శ్రీనివాసరావు, మండలాల అగ్రికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.