మెదక్ మున్సిపాలిటీ, జూన్ 7: మెదక్ జిల్లాలోని యువతీ, యువకులు కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌కు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. పథకంలో భాగంగా భారత వైమానికదళం అగ్నివీర్ వాయు పేరుతో నియామకాలు చేపట్టిందన్నారు. శుక్రవారం సంబంధిత పోస్టర్‌ను కలెక్టరేట్లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు 3 జూలై 2004, 3 జనవరి 2008 మధ్య జన్మించి ఉండాలన్నారు.
అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు గణితం, భౌతిక శాస్త్రం, ఇంగ్లిష్ చదివి ఉం డాలన్నారు. ఇంగ్లిష్‌లో 50శాతం మార్కులతోపాటు మొత్తం 50 శాతం మార్కులతో ఉతీర్ణులై ఉండాలని సూచించారు. అభ్యర్థులు agnipathvayu. cdac.in వెబ్సైట్ ద్వారా c చేసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి నాగరాజు, డీఈవో రాధాకిషన్, ఇంటర్ నోడల్ అధికారి సత్యనారాయణ, వైమానికదళ అధికారులు పాల్గొన్నారు.