మెదక్ రూరల్ సెప్టెంబర్ 18 : విద్యార్థుల సామర్ధ్యాన్ని వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం మెదక్ మండలంలోని మంబోజి పల్లి పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో ఉన్న పరిసరాలను, వంటశాలను, వాటర్ సౌకర్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్న అనేక రకాల శక్తి సామర్థ్యాలను వెలికి తీసి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
దేశ భవిష్యత్తు అంతా విద్యార్థుల చేతుల్లో ఉందని వారిని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అని అన్నారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటించి పలు ప్రశ్నలను అడిగారు వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.