మెదక్, జూన్ 13(నమస్తే తెలంగాణ): బక్రీద్ పండుగను శాంతియుతంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలను కోరారు. గురువా రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు ఎనిమల్స్ ఆధ్వర్యంలో, అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా పశు వైద్యాధికారి విజయశేఖర్‌రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ముస్లిం మత పెద్దలతో పోలీస్‌శాఖ పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించి, జంతు చట్టాలపై అవగాహన కల్పించాలన్నా రు.
జంతువుల నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా లేదా ౩ నెలలు జైలు శిక్ష విధిస్తారని తెలిపారు. జిల్లాలో తూప్రాన్ టోల్గేట్, నర్సాపూర్ చౌరస్తా, కోలపల్లి చెక్‌పోస్టుల వద్ద పోలీసు, వెటర్నరీ, రవాణా శాఖ అధికారుల తో సమీకృత చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తార ని, పశువుల అక్రమ రవాణాను నిరోధించి, పట్టుబడిన పశువులను దగ్గరలోని గోశాలల కు తరలించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి ముందుగానే బైండోవర్ చేయాలని పోలీస్ శాఖకు తెలిపా రు. మెదక్‌లో ఏనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను అతి త్వరలో ప్రారంభించాలని మెదక్ మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. సమావేశంలో పోలీసు, వెటర్నరీ, రవాణా శాఖ అ ధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.