మెదక్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం చేయాలనే లక్ష్యంతో అధికారులు విధులు నిర్వహించాలన్నారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిషారానికి సత్వర చర్యలు చేపట్టాలని, ప్రతి ఒక దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు నిర్ధిష్ట సమయంలో స్పందించాలని సూచించారు. ప్రజలు అధికారులను నేరుగా కలిసే వేదిక ప్రజావాణి అని పేరొంటూ, ప్రజా సమస్యలు తక్షణమే పరిషరించి ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ధరణి 9, భూ సమస్యలు-38, పింఛన్-5, ఇతర సమస్యలు-43 మొత్తం-95 దరఖాస్తు స్వీకరించామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్వో భుజంగరావు, ఏవో యూనస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.