Collector Rahul raj | రామాయంపేట రూరల్, ఏప్రిల్ 12 : రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఇవాళ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన కాలినడకన అటవీప్రాంతంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించి గడ్డపారతో కందకాలు తీశారు. అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నిబంధనల మేరకు పనులు చేయాలని.. కూలీలు తీసిన కందకాలను కలెక్టర్ స్వయంగా కొలతలు చూశారు. జిల్లాలో ప్రతీ గ్రామంలో సుమారు 50కిపైగా ఉపాధి పనులు చేస్తున్నారని.. ఈ సంఖ్య వందకు దాటాలని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కందకాలు తీయడం , సీసీ రోడ్డు, డ్రైనేజీలు కట్టడం, కూలీలకు, రైతులకు ఉపయోగపడే తదితర పనులు చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
పంట పొలాలను పరిశీలించి రైతులను పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాట్రియాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో, మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, మంచి పౌష్టికాహారం ఉండే విధంగా వంటలు చేయాలని ఉపాధ్యాయులకు, భోజన నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాజలోద్దిన్, ఏపీవో శంకర్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఉన్నారు.
Ramakrishna Math | రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలు
padi koushik reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
Mutton | మటన్‌ను ఎంత మోతాదులో తింటే మంచిది..? ఈ లిమిట్ దాటితే కష్టమే..!