మెదక్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులు, వినతులు, అర్జీలు, సమస్యలను సంబంధిత శాఖల అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు వెంటనే పరిషరించాలన్నా రు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి 125 దరఖాస్తులు స్వీకరించారు.
అందులో రైతు పంట రుణమాఫీకి సంబంధించి 40, ధరణికి సంబంధించి 30, పింఛన్లకు సంబంధించి 4, రెండు పడకల గదుల ఇండ్ల కోసం 8, ఇతరత్రా 43 దరఖాస్తులు స్వీకరించారు. ఈమేరకు కలెక్టర్ స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించారు. ప్రజావాణి సమస్యలను పరిషరించే విషయంలో ఏ మాత్రం నిర్ల క్ష్యం వహించాదని, అర్జీలు అందజేసిన వారు తిరిగి రెండోసారి రాకుండా సమస్యలను పరిషరించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస రావు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, సం బంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొ న్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 9: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి పద్మజారాణి అధికారులతో పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు తమ ఫిర్యాదులను అధికారులకు అందజేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ప్రజావాణిలో మొత్తం 96 అర్జీలు అందాయి. ఆయా అర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఇటీవల జిల్లాలో వర్షాలు అధికంగా కురవడంతో పంటలు దెబ్బతిన్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఏవో పరమేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.