కొండాపూర్, సెప్టెంబర్ 18: సర్కారు విద్యను మరింత బలోపేతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సంబంధింత అధికారులు, టీచర్లకు సూచించారు. గురువారం కొండాపూర్లో ఆమె విస్తృతంగా పర్యటించి ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కసూర్బా పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడల్లో, కంప్యూటర్ చదువులపై విద్యార్థులకు ప్రోత్సహించాలన్నారు.
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, కాస్మోటిక్ చార్జీలు సక్రమంగా చెల్లించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యసిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ అశోక్, ఎంపీడీవో వేణుగోపాల్, ఆత్మకమిటీ చైర్మన్ వై.ప్రభు, కొండాపూర్ మాజీ ఎంపీటీసీ నర్సింహారెడ్డి, ఆర్ఐ రాజు తదితరులు ఉన్నారు.