మర్కూక్, అక్టోబర్ 25: సోషల్ వెల్ఫేర్ ఎస్సీ గురుకుల పాఠశాల నిర్వహణకు మర్కూక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న పోలీస్ గృహ సముదాయాలు అనువుగా ఉన్నాయని, సంబంధిత అధికారులు వెంటనే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మను చౌదరి ఆదేంచారు. శుక్రవారం కలెక్టర్ మనుశౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ ఆయా అధికారులతో కలిసి మర్కూక్ పోలీస్ స్టేషన్, పోలీస్ బ్యారక్స్, సమీకృత కార్యాలయ భవనాల నిర్మాణ పనులు, కస్తూర్బాగాంధీ పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్ గృహ సముదాయాలు వాడకంలో లేని కారణంగా సాంఘిక సం క్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలగా మార్చేందుకు పరిశీలించామన్నారు. కొండపాక మండలంలోని అద్దె భవనంలో కొనసాగుతున్న రెసిడెన్షియల్ విద్యాసంస్థను ఇక్కడికి తరలిస్తామన్నారు. అనంతరం మర్కూక్లోని కస్తూర్బా విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. వాన పడితే నీరు విద్యాలయ ప్రాంగణంలోకి చేరి చెరువును తలపిస్తున్నదని ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సమస్య పరిష్కరాస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో బన్సీలాల్, అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, సోషల్ వెల్ఫేర్ అధికారి ప్రత్యూష, గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి, మర్కూక్ తహసీల్దార్ అరీఫా, గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్రెడ్డి, ఎంపీడీవో పాల్గొన్నారు.