సిద్దిపేట,మే09 : ధాన్యం కోనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ మను చౌదరి అన్నారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను క్ష్రేతస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు గన్ని బ్యాగ్, లారీల కొరత, టార్పాలిన్ కవర్లు కోరత ఉందని కలెక్టర్‌కు విన్నవించారు. ఈసందర్బంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ ధాన్యం తేమశాతం రాగానే గన్ని బ్యాగులు అందజేయాలని సెంటర్ సిబ్బందిని ఆదేశించారు.
టార్పాలిన్ కవర్లు, లోడ్ చేయడానికి లారీల కొరత తీర్చాల్సిందిగా సివిల్ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. పుల్లూరులో కొనుగోలు కేంద్రం కోసం గవర్నమెంట్ భూమి ఉందని గ్రామస్తులు తెలుపగా తహసీల్దార్‌ను పంపించి ఎంక్వయిరీ చేయిస్తానని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సెంటర్లలో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని సెంటర్ సిబ్బందిని ఆదేశించారు.