చిన్నకోడూరు, జూలై 8: పర్యావరణాన్నిపరిరక్షించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లోని రంగనాయక సాగర్, టన్నెల్‌ను మంగళవారం ఆమె సందర్శించారు. గ్రామ శివారులోని వెటర్నరీ కళాశాలలో మొక నాటారు. అనంతరం గంగాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొకలు పెం చడం ద్వారా భవిష్యత్ తరాలకు కాలుష్యం నుంచి రక్షించడమే కాకుండా ప్రశాంత వాతావరణంలో జీవించగలుగుతామన్నారు.
మొకలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా టోకెన్లు అందించాలని తహసీల్దార్ సలీమ్‌ను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి ముందుగా డబ్బులు లేని నిరుపేదలకు ఐకేపీ ద్వారా అందించాలని డీఆర్డీవో ప్రాజెక్టు డైరెక్టర్ జయదేవ్ ఆర్యను ఆదేశించారు. డీఈ చంద్రశేఖర్ పంప్‌హౌస్ విభాగాలు, మోట ర్లు, పంపింగ్ విధానాన్ని కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సదానందం, ఎంపీడీవో జనార్దన్, ఎంపీవో సామిరెడ్డి తదితరులు ఉన్నారు.