మెదక్, జనవరి 20 (నమస్తే తెలంగా ణ): మెదక్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై మెదక్ కలెక్టర్ ఎస్. హరీశ్ ఏజెన్సీ నిర్వాహకులు, ఆర్అండ్బీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. శుక్రవారం నూతన కలెక్టరేట్ నిర్మాణ పనుల ప్రగతిని ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులు, డీఎఫ్‌వోతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వివి ధ జిల్లాలో కలెక్టరేట్ నిర్మాణాలు పూర్త యి ప్రారంభమవుతున్నా, ఎకడాలేని విధంగా మన జిల్లాలో నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతుండటం ఏమిటని ఆగ్ర హం వ్యక్తం చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ అంతా కలియతిరిగి ఇంకా అకడకడ అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, వాటర్ సంప్ కు వెంటనే నీటి కనెక్షన్ ఇవ్వాల్సిందిగా మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అంతర్గత సీసీ రోడ్లు నాణ్యతతో వేయాలని, ప్రహారీ నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
కలెక్టరేట్ ఆవరణ ఆహ్లాద వాతావరణం కనిపించేలా పచ్చదనం, చకటి నీడ కల్పించేలా మొక లు ఇప్పటి నుంచే నాటాల్సిందిగా జిల్లా అటవీ అధికారికి సూచించారు. కలెక్టర్ వెంట ఆర్అండ్బి ఈఈ శ్యాంసుందర్, డిప్యూటీ ఈఈ వెంకటేశం, ఏఈ రియాజ్, జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్, ఏజెన్సీ ప్రాజెక్ట్ మేనేజర్ రాజేష్, సిబ్బంది ఉన్నారు.