మెదక్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ)/పాపన్నపేట: అందరి ఆశీర్వాదం కావాలి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం క్రిస్మిస్ పండుగ సందర్భంగా మెదక్ చర్చి ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి బిషప్ రెవరెండ్ రూబెన్ మార్, ప్రిసిబీటర్ ఇన్చార్జి శాం తయ్య ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతకుముందు పాపన్నపేట మండలంలోని వనదుర్గమాత ఆలయాన్ని సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు సీఎంకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏడుపాయల వనదుర్గమ్మ సన్నిధిలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూశాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, అటవీ, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఏడుపాయల వనదుర్గాభవాని మాతకు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం మెదక్ నియోజకవర్గంలో రూ.409.58 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. మెదక్ చర్చి అభివృద్ధికి రూ.29 కోట్లతో శంకుస్థాపనలు చేశా రు. ఏడుపాయల వనదుర్గాభవాని మాత ఆలయానికి వచ్చే ప్రధాన రహదారిని రెండు వరుసల రోడ్డుతో పాటు డివైడర్ ఫ్లడ్‌లైట్ల ఏర్పాటుకు రూ.35కోట్లు, మెదక్ జిల్లా కేంద్రంలో మహిళా శ్రీశక్తి భవన నిర్మాణం కోసం రూ.5 కోట్లు, గిరిజన తండాల్లో రవాణా సౌకర్యం కోసం రూ.52.76 కోట్లు, రూ.205 కోట్లతో యంగ్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణాల కోసం రూ.7.4కోట్ల పనులకు శంకుస్థాపన చేశా రు.
అనంతరం వారికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు రూ.102 కోట్ల చెకును స్వయం సహాయక సం ఘాలకు అందజేయగా బ్యాంకు లింకేజీ కోసం అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీలు రఘునందన్‌రావు, సురేశ్శెటార్, ఎమ్మెల్యే రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే హనమంతరావు, జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, నారాయణనఖేడ్ ఎమ్మెల్యే సంజీవరావు, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, నీలం మధు ముదిరాజ్, శ్రవణ్ కుమార్‌రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, చీఫ్ సెక్రటరీ సంగీత, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేశ్, మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తోపాటు వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత అప్ప, సుప్రభాతరావు, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మెదక్ జిల్లా ఇన్చార్జి ఆంజనేయులు, దుబ్బాక ఇన్చార్జి శ్రీనివాస్‌రెడ్డి, సిద్దిపేట ఇన్చార్జి హరికృష్ణ, ప్రశాంత్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గోవింద్‌నాయక్, నాయకులు భూమయ్య, సతీశ్, నరేందర్‌గౌడ్, గౌస్, మహేశ్‌గుప్తా, రాము, శ్రీనివాస్‌తోపాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.