రామాయంపేట/ మెదక్ రూరల్/ నిజాంపేట/ పాపన్నపేట, ఏప్రిల్ 30 : సీఎం కేసీఆర్ రైతులకు పెద్దపీట వేస్తున్నారని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్ర అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలోని హరిజనవాడ, కోమటిపల్లిలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, మాట్లాడారు. మెదక్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధ్వర్యంలో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. క్వింటాల్ ధాన్యానికి రూ.2060 ఇస్తున్నట్లు తెలి పారు. వడగండ్ల వానకు నష్టాలకు గురైన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తున్నదన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు పదివేల ఎకరాల్లో పంట నష్టం జరినట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దేమె యాదగిరి, పీఏసీఎస్ సీఈవో నర్సింహులు ఉన్నారు.
ప్రమాణాలు పాటిస్తూ తూకం వేయాలి
మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి
మెదక్ మండలంలోని పేరూరులో పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని మెదక్ పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హన్మంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రైతే రాజు అని, సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారన్నారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి, మద్దతు ధర పొందాలన్నారు. రైతులు వడ్లు ఎండబోసి, తాలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటి స్తూ తూకం వేయాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ జానకీరాంరెడ్డి, కొను గోలు కేంద్రం ఇన్చార్జిలు, బీఆర్ఎస్ నాయకులు నగేశ్, యాదాగౌడ్, పుట్టి నర్సింహులు, రైతులు పాల్గొన్నారు.
దళారులకు ధాన్యం విక్రయించొద్దు కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ కొండల్‌రెడ్డి
నిజాంపేట మండలపరిధిలోని కల్వకుంట, రజాక్‌పల్లి గ్రా మాల్లో కొనుగోలు కేంద్రాలను కల్వకుంట పీఏసీఎస్ చైర్మన్ అందె కొండల్‌రెడ్డి ప్రారంభించి, మాట్లాడారు. దళారీ వ్యవస్థను రూపుమాపడానికే ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తరలించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు రేణుక, వెంకట్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, నారాగౌడ్, సీఈవో గోపాల్‌రెడ్డి, రజాక్‌పల్లి ఉప సర్పంచ్ సత్యనారాయణగౌడ్, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్, కనకయ్య, కొమురయ్య, రాజేశ్, రామ చంద్రారెడ్డి, రైతులు నారాగౌడ్, మైరాములు ఉన్నారు.
నిజాంపేట మండలంలోని రాంపూర్, నస్కల్, నందగోకుల్, నగరం, జడ్చెరువుతండాలో రామాయంపేట పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ సిద్ధిరాములు, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్ మంగ్యానాయక్ ప్రారంభించారు.
సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ బాపురెడ్డి
పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామంలో ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని సర్పంచ్ బాపురెడ్డి ప్రారంభించారు. రైతు లు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బాపురెడ్డి సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఏవో నాగరాజు, నేతలు లక్ష్మాగౌడ్, సత్యనారాయణరెడ్డి, కుమ్మరి కృష్ణ, బుడిమే విఠల్, రైతులు కోరబోయిన నర్సింహులు, అంజిరెడ్డి పాల్గొన్నారు.