గజ్వేల్ పట్టణం గులాబీమయమైంది. గులాబీదండు గుబాళించింది. బైక్‌ర్యాలీలతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. గురువారం ఉదయం ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రం నుంచి సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో గజ్వేల్‌కు చేరుకున్నారు. హెలిప్యాడ్ దిగిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక కాన్వాయ్‌లో ఐవోసీ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి రెండుసెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ప్రచార రథంపై నుంచి సీఎం కేసీఆర్ ప్రజలకు అభివాదం చేశారు. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్, కేసీఆర్ జిందాబాద్, జైకేసీఆర్ అంటూ పెద్దఎత్తున జనం నినాదాలు చేశారు. గ్రామాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. సీఎం పర్యటన గులాబీ శ్రేణుల్లో కొత్తజోష్ను నింపింది.
గజ్వేల్, నవంబర్ 9: ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రం నుంచి సీఎం కేసీఆర్ గురువారం ఉదయం గజ్వేల్‌కు హెలికాప్టర్లో చేరుకున్నారు. హెలిప్యాడ్ దిగిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక కాన్వాయ్‌లో ఐవోసీ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొని గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మొదటి సెట్‌ను మాజీ జడ్పీ చైర్మన్ ఎం.లక్ష్మీకాంతారావు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి, ములుగు ఏఎంసీ చైర్మన్ జహంగీర్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి, రెండో సెట్‌ను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మెదక్ జడ్పీ చైర్ పర్సన్ హేమలత, మాజీ ఎంపీపీ చిన్నమల్లయ్య, మాజీ జడ్పీటీసీ రామచంద్రం ప్రతిపాదించారు. నేరుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొని ముఖ్యమంత్రి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్వో బన్సీలాల్‌కు అందజేశారు. అనంతరం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు గజ్వేల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. హెలికాప్టర్ నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరిన సీఎం కేసీఆర్‌కు రోడ్డుమార్గంలో పూలవర్షం కురిపించారు. వాహనశ్రేణిపై పూలుచల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు.
గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. హెలికాప్టర్లో గజ్వేల్‌కు చేరుకొని నామినేషన్ వేసేందుకు వెళ్లి తిరిగి హెలిప్యాడ్ ప్రదేశానికి చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రికి పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, రఘోత్తమంరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మెదక్ జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్న్లు మడుపు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, పన్యాల భూపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, రైతుబంధు సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవీరవీందర్, ఎంపీపీలు అమరావతి, లత, బాలేషంగౌడ్, పాండుగౌడ్, జడ్పీటీసీ మల్లేశం, సుధాకర్‌రెడ్డి, జయమ్మాఅర్జున్గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధు, కరుణాకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, నాయకులు కిషన్‌రెడ్డి, విరాసత్‌అలీ, రూబెన్ ఉన్నారు.
గజ్వేల్ ఐవోసీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ నామినేషన్ వేసిన తర్వాత హెలిప్యాడ్ ప్రదేశానికి చేరుకొని ప్రచారరథంపై తిరుగుతూ కార్యకర్తలకు అభివాదం చేశారు. ప్రజలు జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. వేలాది మంది కార్యకర్తలతో ఐవోసీ కార్యాలయ వెనక మైదానం మార్మోగింది.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల నుంచి భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీతో గజ్వేల్‌కు తరలివచ్చారు. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్, పిడిచేడ్ నుంచి గజ్వేల్, సంగాపూర్ నుంచి గజ్వేల్, ధర్మారెడ్డిపల్లి నుంచి గజ్వేల్ మార్గాలు ద్విచక్ర వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 9 గంటల నుంచే అన్నిదారులు గజ్వేల్ వైపే కనిపించాయి. భారీ బైక్ ర్యాలీ గజ్వేల్‌కు చేరుకోవడంతో గులాబీమయంగా కనిపించింది. గజ్వేల్ రూరల్ మండలం నుంచి ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో భారీబైక్ ర్యాలీని కోటమైసమ్మ దేవాలయం నుంచి ఐవోసీ భవనం వెనుక మైదానం వరకు తీశారు. చెట్లు, భవనాలపై నిలబడిన జనం సీఎం కేసీఆర్‌ను చూశారు.
నామినేషన్ వేసిన తర్వాత తిరిగి కామారెడ్డికి వెళ్తున్న సందర్భంలో హెలిప్యాడ్ వద్ద సీఎం కేసీఆర్‌కు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ప్రతి ఒక్కరినీ కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు.
సీఎం కేసీఆర్‌ను చూసేందుకు గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావడంతో గజ్వేల్ పట్టణం గులాబీమయమైంది. రోడ్లన్నీ బైక్‌ర్యాలీలతో కిక్కిరిసికనిపించాయి. పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా గజ్వేల్‌కు చేరుకున్నారు. హెలికాప్టర్ దిగిన కేసీఆర్ అభివాదం చేయగానే హ్యాట్రిక్ సీఎం కేసీఆర్, కేసీఆర్ జిందాబాద్, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ప్రచారం రథం నుంచి అభివాదం చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. గ్రామాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తరలిరావడంతో గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపించింది.
గజ్వేల్ అర్బన్, నవంబర్ 9: ఉదయం 9:00 గంటల నుంచే గజ్వేల్ పట్టణంతో పాటు అన్ని మండలాలు, ఆర్అండ్ఆర్ కాలనీ నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గజ్వేల్‌కు చేరుకున్నారు. హెలిప్యాడ్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో అరకిలోమీటరు దూరం నుంచి కేసీఆర్‌ను చూడడానికి అనుమతించారు. ఐవోసీ కార్యాలయానికి వచ్చే నాలుగు దారుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో రోడ్లన్నీ నిండిపోయాయి.