మనోహరాబాద్/ తూప్రాన్, అక్టోబర్ 27 : తెలంగాణలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూపతిరెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, సీఎం కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, రైతుబంధు కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సీనియర్ నేత పెంటాగౌడ్, ఉప సర్పంచ్ ధర్మేందర్, ఆత్మకమిటీ డైరెక్టర్లు రాహుల్‌రెడ్డి, భిక్షపతి, నేతలు సుధాకర్‌రెడ్డి, నరేన్, ప్రభాకర్‌రెడ్డి, జావీద్‌పాషా, నరేందర్‌గౌడ్, సాయిరాంగౌడ్ పాల్గొన్నారు.
గజ్వేల్‌లో లక్ష మెజార్టీతో కేసీఆర్ గెలుస్తా రని ఫుడ్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు బాబుల్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి అన్నారు. తూప్రాన్ మండలం కోనాయపల్లిలో ప్రచారం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాణీసత్యనారాయ ణ, ఎంపీపీ స్వప్నవెంకటేశ్యాదవ్, సర్పంచ్ పాండు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులుగౌడ్, మాజీ జడ్పీటీసీ భాస్కర్‌రెడ్డి, నేతలు రమేశ్, జంగం రమేశ్ పాల్గొన్నారు