మంత్రి సమక్షంలో ప్రొటోకాల్ రగడ
ప్రొటోకాల్ విషయంలో బుధవారం మెదక్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. బుధవారం మెదక్ జిల్లా కొల్చారంలో బడిబాట కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమంలో స్టేజీపై ప్రొటోకాల్ పాటించక పోవడంతో నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- మెదక్ జిల్లా కొల్చారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట
కొల్చారం, జూన్ 19 : ప్రొటోకాల్ విషయంలో బుధవారం మెదక్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. బుధవారం మెదక్ జిల్లా కొల్చారంలో బడిబాట కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమంలో స్టేజీపై ప్రొటోకాల్ పాటించక పోవడంతో నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేజీపై స్థానిక ప్రజాప్రతినిధులకు స్థానం కల్పించకుండా కాంగ్రెస్ నాయకులను కూర్చోబెట్టడం ఏమిటని అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ మొదలై తోపులాటకు దారితీసింది. ఎమ్మెల్యే సునీతారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి ఇరుపార్టీల కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా గొడవకు దిగారు. జై తెలంగాణ అంటూ బీఆర్ఎస్ నాయకులు, జై కాంగ్రెస్ అంటూ అధికార పార్టీ నాయకులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో బడిబాట ముగింపు సభ పూర్తి కాకుండానే అతిథులు మధ్యలోనే వెళ్ల్లిపోయారు.
పదవులు లేనివారి పెత్తనం ఏమిటీ : నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
ఎలాంటి పదవులు లేని కాంగ్రెస్ నాయకులు అధికారిక కార్యక్రమాల్లో పెత్తనం చెలాయించడం ఏమిటని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రశ్నించారు. కొల్చారంలో నూతన ఎంపీపీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి గుమ్మడికాయ కొట్టడంపై సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అయిన తనను కాదని ఓడిపోయిన అభ్యర్థికి మంత్రి కొండాసురేఖకు కత్తెర అందించి ఎలా రిబ్బన్ కట్ చేయించారు అని ప్రశ్నించారు. అలాగే ఎంపీపీ మంజుల తన చాంబర్లో రిబ్బన్ కట్ చేసేటప్పుడు ఎమ్మెల్యే సునీతారెడ్డి, జడ్పీటీసీ మేఘమాల సంతోష్కుమార్ను కాదని మంత్రి కొండాసురేఖతో కాంగ్రెస్ నాయకులు ముందుకు వెళ్లిపోయారు. దీంతో ఎంపీపీ మంజుల అక్కడే నేలపై కూర్చుని నిరసన తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డిపల్లి ఆంజనేయులు, రవీందర్రెడ్డి ఆమెకు నచ్చజెప్పి ముందుకు తీసుకెళ్లారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

