ప్రాధాన్యతా కార్యక్రమాలపై దృష్టి సారించాలి
ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో వివిధ అంశాలపై సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు శరత్‌కుమార్, రాజర్షి షా, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
- ఈ నెల 10లోగా రూ.లక్ష సాయం చెక్కులను అందజేయాలి
- గృహలక్ష్మి పథకం కింద ఇండ్ల మంజూరు
- రెండో విడతలో నియోజకవర్గాకి 1100 మందికి దళిత బంధు
- వీడియోకాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ శరత్
ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో వివిధ అంశాలపై సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు శరత్‌కుమార్, రాజర్షి షా, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ కులవృత్తులకు రూ. లక్ష సాయం మొదటి విడుతలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 300 మంది లబ్ధిదారులకు ఈ నెల 10వ తేదీలోగా చెక్కులు పంపిణీ చేయాలని సూచించారు. గృహలక్ష్మి పథకం కింద ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రభుత్వం మూడు వేల ఇండ్లు మంజూరుచేసిందని తెలిపారు. రెండో విడుత దళితబంధు ప్రక్రియను వేగవంతం చేసి, 1100 మంది లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 7: ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎస్ మాట్లాడుతూ బీసీ కులవృత్తులకు రూ.లక్ష ఆర్థికసాయానికి సంబంధించి మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులకు ఈ నెల 10లోగా చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆగస్టు 10 నుంచి 20 వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలన్నారు. అదేవిధంగా రెండో విడత దళితబంధులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులకు దళితబంధు అందించాలని, లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.
జిల్లాలో రెండో విడత దళితబంధుకు 3,787 దరఖాస్తులు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో రెండో విడత దళితబంధుకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి 1100 చొప్పున 5500 మంది లబ్ధిదారులకు అందించడమే లక్ష్యంగా ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పటివరకు 3,787 దరఖాస్తులు జిల్లాలో అందాయన్నారు. అందులో 2,571 దరఖాస్తులను పరిశీలించడం పూర్తయిందన్నారు. పరిశీలన పూర్తయిన దరఖాస్తులన్నింటినీ వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నామని వివరించారు. ఈ వారంలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తామని తెలిపారు. బీసీ కులవృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సహాయానికి సంబంధించి 299 మందికి చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఈ వారంలోగా ఈ నెల జిల్లా లక్ష్యం మేరకు పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గొర్రెల పంపిణీ పథకంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇప్పటివరకు జిల్లాకు 366 యూనిట్లు వచ్చాయని తెలిపారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్వో నగేశ్, డీఆర్డీవో, డీపీవో, వివిధ శాఖల అధికారులున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

