మునిపల్లి, మార్చి 24 : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలను మోసం చేస్తున్నదని, ఆరు గ్యారెంటీలు, హామీల అమలు విస్మరించిందని అందోల్ మాజీఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సోమవారం ఖమ్మంపల్లి శివారులోని శ్రీసాయి గార్డెన్లో మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లి, బుధేరా, బేలూర్కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా చంటి క్రాం తి కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, మోసపూర్తి పాలన నచ్చక ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు.
కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే, రేవంత్ సర్కారు రాష్ర్టాన్ని నాశనం చేస్తున్నట్లు విమర్శించారు. మునిపల్లి మండలం లింగంపల్లిలో పుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేస్తే, కాంగ్రెస్ పనులు ఆపిందన్నారు. చిన్నచెల్మడలో సంగమేశ్వర ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తే, ఆ పనులు ముం దుకు సాగడం లేదన్నారు. సింగూరు నీరు విడుదల చేయడంలో మం త్రి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శించారు. అనంతరం బుధేరా లోని ఎన్ గార్డెన్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో క్రాంతికిరణ్ పాల్గ్గొన్నారు. కార్యక్రమంలో సాయికుమార్, శశికుమార్, భాస్కర్, ఆనంద్‌రావు, మౌలానా, ముస్లింలు పాల్గొన్నారు.