మునిపల్లి, నవంబర్ 2 : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, సీఎం రేవంత్ మతిలేని మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంటి రాహుల్ కిరణ్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలను ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత మోసం చేసిందన్నారు. ప్రజల ముందుకు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నమ్మించి గొంతు కోయ డం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోతుందని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్‌ను సొంత పార్టీ నాయకులే నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో ప్రజల నమ్మకం కోల్పోయిందన్నారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారని రాహుల్ కిరణ్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేదని, సంక్షేమం అటకెక్కిందని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని దుస్థితిలో ఈ సర్కారు ఉందని రాహుల్‌కిరణ్ దుయ్యబట్టారు,.