నిజాంపేట : మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన బండారి చిన్నక్క ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల మృతి చెందింది. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు చల్మెటి నరేందర్ భాగ్యలక్ష్మి గురువారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 వేలతో పాటు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.
కార్యక్రమంలో నాయకులు సిద్దిరామ్రెడ్డి, జాల పోచయ్య, గరుగుల సుధాకర్, గెరిగంటి బాబు, కొమట అమర్, కోమట స్వామి, కాలనివాసులు బండారి యాదగిరి బండారి ఎల్ల స్వామి, బండారి యాదగిరి, బండారి మోహన్ ఉన్నారు.