రామాయంపేట, ఏప్రిల్ 29 : అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్న ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు రామాయంపేట ఎస్ఐ బాలరాజు పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మండలంలోని రాయిలాపూర్ గ్రామంలో గత కొద్దిరోజులుగా గ్రామానికి చెందిన భూమగారి బాబాగౌడ్, గట్టు ఇసాక్లు అక్రమంగా మద్యం అధిక ధరలకు విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారనే సమాచారం మేరకు సోమవారం రాత్రి వారి ఇండ్లపై దాడులు చేశామన్నారు.
దాడుల్లో మద్యం బాటిల్లు లభ్యమైనట్లు తెలిపారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దార్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రామాయంపేట మండల వ్యాప్తంగా అక్రమంగా ఎవరైనా మద్యం విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.