కోహీర్, జనవరి7: చర్చి స్లాబ్ నిర్మాణ ప్రమాదంలో ఓ కార్మికుడి మృతి చెందిన ఘటన పట్టణంలో ఆదివారం జరిగింది. ఎస్సై విఠల్, స్థానికుల వివరాల ప్రకారం… కోహీర్‌లోని మెథడిస్ట్ చర్చి స్లాబ్ నిర్మా ణ ప్రమాదంలో బర్మాకు చెందిన ఖాసిముల్లా (19) మృతి చెందాడు. జార్కండ్, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్‌కు చెందిన కొంతమంది కార్మికులు స్లాబ్ పనుల్లో నిమగ్నమయ్యారు. యంత్రం సహాయంతో పైకప్పు వేస్తున్న సమయంలో నిర్మాణంలో ఉన్న స్లాబ్ అకస్మాత్తుగా కూలింది. దీంతో ఖాసిముల్లాషేక్, రాజు, అబ్దుల్లా రహీమ్, డలీమ్, తుర్జవూల్ షేక్, ఓంప్రకాశ్, షేక్ ఆదిల్, మోహన్‌సింగ్, కృష్ణ, అమర్‌కు గాయాలయ్యాయి. ఇనుప చువ్వ లు, కట్టెలు వారిపై పడడంతో గాయపడ్డారు. ఖాసిముల్లా షేక్, రాజుకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బర్మాకు చెందిన ఖాసిముల్లా షేక్ మృతిచెందాడు. హైదరాబాద్‌కు చెందిన రాజు ఆరోగ్య పరిస్థతి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మిగతా వారికి కోహీర్ దవాఖాన లో చికిత్స అందిస్తున్నారు. జహీరాబాద్ డీఎస్పీ రఘు, సీఐ రాజు, ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలాన్ని సందర్శంచి వివరాలు సేకరించారు. పనుల్లో నిర్లక్ష్యం చేసిన కాంట్రాక్టరును అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విఠల్ వెల్లడించారు.
కోహీర్, జనవరి 7 : కోహీర్‌లోని మెథడిస్ చర్చి స్లాబ్ నిర్మాణంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అం దించాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు కోరారు. ఆదివారం మెథడిస్ట్ చర్చి స్లాబ్ నిర్మాణ ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఘటనా స్థలాన్ని సందర్శించారు. కాంట్రాక్టర్, స్థానికులతో మాట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వహీ ద్, కలీం, సందీప్, సునీల్, నిరంజన్ ఉన్నారు.