జహీరాబాద్, డిసెంబర్ 2: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్వీ రా్రష్ట్ర ఉపాధ్యక్షుడు, సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి పడాల సతీశ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం జహీరాబాద్ పట్టణంలోని ఎస్టీ బాలుర వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహంలో సోలార్ ఫ్లాంట్ పాడై విద్యార్థులు స్నానాలు చేసేందుకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. వసతి గృహంలోని పరిసరాలు శుభ్రంగా లేక దోమలు, ఈగల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి జబ్బుల బారిన పడి విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. వసతి గృహంలో సరిపడా ఫ్యాన్లు, ముత్రశాలలు, మరుగుదొడ్లు సక్రమంగా లేవని ఆరోపించారు. ఆయన వెంట బీఆర్ఎస్వీ నాయకులు రాకేశ్, బండిమోహన్, రవికిరణ్, ఓంకర్, ఫయాజ్, అశోక్‌రెడ్డి, శివప్ప, మనోజ్ ఉన్నారు.