రాయపోల్, మే 9 : ప్రజాశ్రేయస్సే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో వీరభద్ర రైస్‌మిల్లు ఆవరణలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దేశంలో అగ్రగమిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో తెలంగాణపై వివక్షత చూపుతున్నదన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని మోదీ ప్రభు త్వం.. బీజేపీ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికహక్కు లేదన్నారు. అభివృద్ధిలో మనమే అదర్శంగా ఉన్నామని, మన పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని విమర్శించారు.
మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని, రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. రానున్న ఎన్నికల్లో రఘునందన్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ధరలు పెంచి సామాన్యుల ఉసురుతీస్తున్న కేంద్రం ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బక్కి వెంకటయ్య, మామిడి మోహన్‌రెడ్డి, మనోహరావు, ఎంపీపీ అనిత, జడ్పీటీసీ యాదగిరి, వైస్ ఎంపీపీ రాజారెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్ రవీందర్‌గౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు పర్వేజ్ అహ్మద్, సర్పంచ్ చంద్రశేఖర్, బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు వెంకటేశ్వరశర్మ, యూత్ అధ్యక్షుడు తీగుళ్ల స్వామి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రవి, బీఆర్ఎస్ రాష్ట్ర యూత్ నాయకుడు రాజిరెడ్డి, జిల్లా నాయకులు శ్రీనివాస్, దయాకర్, లక్ష్మారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనంతో పార్టీలో కొత్త జోష్ కనిపించింది.
దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు..
-ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్సీ
దుబ్బాక ప్రజలు ఎంతో చైతన్యవంతులని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్సీ ఫారూ ఖ్ హుస్సేన్ అన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపిం చి ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నట్లు ఆయన గుర్తుచే శారు. సీఎం కేసీఆర్ దేశంలోనే రాష్ర్టాన్ని ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తున్నారని, దేశ ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ దేశంలో రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు.
ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం
-బోడెకుంటి వెంకటేశ్వర్లు,బీఆర్ఎస్ జిల్లా సమన్వయ కర్త
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని బీఆర్ఎస్ జిల్లా సమన్వయ కర్త బోడెకుంటి వెంకటేశ్వర్లు అన్నా రు. అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు కేవలం ఉనికి కోసం పాటుపడుతున్నారే తప్ప నిరుపేదలపై చిత్త శుద్ధిలేదన్నారు. రానున్న ఎన్నికల్లో దేశం, రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రజలకు వద్దకు వెళ్లి ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందని, ప్రజలకు ప్రతిపక్షాలు ఏమిచేశారని చెప్పుకుంటాయ ని ఆయన ప్రశ్నించారు. దుబ్బాకలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు.