శివ్వంపేట, జనవరి 26: కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించకుండా కాలయాపన చేయడానికే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించిందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తపేటలో సర్పం చ్ సాన్వి రమాకాంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రమాకాంత్రెడ్డిల ఆధ్వర్యంలో రూ. 75లక్షలతో వివిధ అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేయడం అసాధ్యమని, ఆలోపే ఎంపీ ఎన్నికల కోడ్ వస్తుందని, ఇలా కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ హయాంలో మంజూరు చేసిన దాదాపు రూ.250 కోట్ల ఎస్డీఎఫ్ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
2 ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయభూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం రాలేదని, వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎంపీ, స్థానిక సం స్థల ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, ముగ్గుల పోటీ ల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బ మహేశ్‌గుప్తా, జడ్పీ కోఆప్షన్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, సీనియర్ నాయకులు వెంకట్‌రెడ్డి, యాదాగౌడ్, పవన్‌గుప్తా, చింతస్వామి, పిల్లుట్ల నర్సింహారెడ్డి, మర్రి మహేందర్‌రెడ్డి, మోకాళ్ల నవీన్ తదితరులు ఉన్నారు.