సంగారెడ్డి, ఏప్రిల్ 21: బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం నిరాడంబరంగా చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, మాణిక్‌రావు హాజరయ్యారు. చింతాకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ప్రధాన రహదారి నుంచి అతిథి గృహం లోపలికి భారీ గజమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయూరారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని, త్వరగా కోలుకోవాలని పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రెండు మున్సిపాలిటీలు, కొండాపూర్, కంది మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
నిర్మల పునరావాస కేంద్రంలో భీమ్ సోల్జర్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి మంత్రి కావాలని కోరుకున్నారు.
ఈ వేడుకల్లో సంగారెడ్డి, కంది, కొండాపూర్ మండల పార్టీల అధ్యక్షులు చక్రపాణి, మధుసూదన్‌రెడ్డి, మాకం విఠల్, కౌన్సిలర్లు రామప్ప, విష్ణువర్దన్, అశ్విన్‌కుమార్, శ్రీకాంత్ (నాని), పవన్‌నాయక్, కంది జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, ఎంపీపీ సరళాపుల్లారెడ్డి, సర్పంచ్‌లు గోపాల్‌రెడ్డి, మోహన్‌నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మసూద్, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంజాద్, ఆజీమ్, బీఆర్ఎస్ నాయకులు విజయేందర్‌రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర్, నర్సింలు, మనోహర్‌గౌడ్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, బత్తుల శ్రీనివాస్, నటరాజ్, చిన్నా, బీఆర్ఎస్ యూత్ నాయకులు సంతోశ్, రాజశేఖర్, విష్ణు, బాషా తదితరులు పాల్గొన్నారు.