నర్సాపూర్,నవంబర్11: నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండల కేంద్రంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించిన రైతు నిరసనదీక్ష విజయవంతమైనందుకు మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులను అభినందించారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు.
సోమవారం ఆమె గచ్చిబౌలిలోని మాజీ మంత్రి హరీశ్‌రావును ఆయన నివాసంలో,తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు దుర్గారెడ్డి, సత్యంగౌడ్, ప్రసాద్, షేక్‌హుస్సేన్, ఎల్లమయ్య, ప్రవీణ్, నరహరి, కాంతారావు, రాజు, నవీన్, శేఖర్, పోచయ్య, చక్రి, లక్ష్మణ్, ప్రభు ఉన్నారు.