కోహీర్, మే 27: జహీరాబాద్ పట్టణంలోని 13వ వార్డు బాగారెడ్డిపల్లిలో సోమవారం భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ప్రారంభించారు. మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండిమోహన్ నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మాణిక్‌రావు రిబ్బన్ కట్ చేసి కార్యకర్తలకు అందుబాటులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా బండి మోహన్‌ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. మిఠాయిలు తినిపించుకొని సంబురాలు చేసుకు న్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్ గుప్తా, చందు, తులసీదాస్, ప్రభు, శ్రీనివాస్, రాకేశ్, శివప్ప, రాజేందర్, రాజు, సురేశ్, రాజ్‌కుమార్, మనోజ్, సందీప్, రామ్, మధు, విజయ్, పరశురాం, తదితరులు పాల్గొన్నారు.