గుమ్మడిదల, డిసెంబర్ 2: బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాకింగ్‌రాకేశ్ తీసిన సినిమా చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిన్నారం వెంకటేశ్‌గౌడ్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలోని శ్రీవెంకటేశ్వరస్వామి సినిమా థియేటర్లో ‘కేసీఆర్’ చిత్రాన్ని రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి సొంత ఖర్చులతో మూడు రోజులు ప్రదర్శించే షోను బీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు.
ఈ సినిమా చూడటానికి ఉమ్మడి జిన్నారం మండలంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉచిత ప్రదర్శనకు ముందుకు వచ్చిన చిమ్ముల గోవర్ధన్‌రెడ్డిని పలువురు బీఆర్ఎస్ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ చిత్రం అందరినీ ఆలోచింపజేస్తున్నదన్నారు. ఇలాంటి ఉత్తమ కథను తీసుకుని కేసీఆర్ చిత్రం తీయడం అభినందనీయమన్నారు.
తెలంగాణ కోసం ఆయన చేసిన ఉద్యమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆలోచింప జేసిన ఘనత ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కుతున్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు చిమ్ముల నర్సింహారెడ్డి, హన్మంత్‌రెడ్డి, ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, మంద భాస్కర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, నాయకులు సోలకపల్లి ప్రభాకర్‌రెడ్డి, సూర్యనారాయణ, మహిపాల్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, వాసుదేవారెడ్డి, దేవేందర్‌రెడ్డి, రమణారెడ్డి, భాస్కర్, ఆంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.