మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 27 : ఎమ్మెల్సీ కల్వకుంట కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ ఆధ్వర్యంలో బాణాసంచా కా ల్చి సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందన్నారు. కవితపై అ క్రమ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్, రాజ్, మాజీ కౌన్సిలర్లు సోహెల్, చంద్రకళ, నాయకులు ప్రభురెడ్డి, మధు, జూబేర్, ఫాజిల్, జగదీశ్వర్, రవి, కిరణ్, మహేశ్‌యాదవ్, రాజు అమీర్ తదితరులు పాల్గొన్నారు.
అల్లాదుర్గం, ఆగస్టు 27 : ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు ఆవుల అంజి యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా, కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే కవితను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.
చిలిపిచెడ్, ఆగస్టు 27 : లిక్కర్ స్కాంలో అక్రమంగా అరెస్టు చేసిన కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.
మెదక్ మున్సిపాలిటీ, ఆగష్టు 27 : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉందని కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితను అక్రమంగా కేసులో ఇరికించడం దురదృష్టకరమని బీఆర్ఎస్ మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ల అంజనేయులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయ డం హర్షణీయమన్నారు.
శివ్వంపేట, ఆగస్టు 27 : బీజేపీ నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లొంగదీసుకోవాలనే ఉద్దేశంతో కవితను అరెస్టు చేశారని గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ ఛైర్మన్ చంద్రాగౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సాక్షిగా ఉన్న కవిత ముద్దాయి ఎలా అయిందని, ఇన్ని రోజులుగా ఆమె నుంచి ఎంత డబ్బు రికవరీ చేశారని సుప్రీంకోర్టు నిలదీయగా సమాధానం లేకపోవడంతో, ఫాల్స్ కేసుల నుంచి చివరకు సుప్రీం తీర్పుతో ధర్మమే గెలిచిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.
చేగుంట, ఆగస్టు 27 : ఎప్పటికైనా న్యా యం గెలుస్తుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైలరాం బాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఎ మ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కేసులో అక్రమం గా ఆరెస్టు చేసి, సీబీఐ విచారణ పేరున జైలులో పెట్టిందని అన్నారు. అది రాజకీయ కోసం చేసిన ఆరెస్టు మాత్రమే అన్నారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయ డం హర్షణీయమని ఆయన సంతోష వ్యక్తం చేశారు. ఆయనతో పాటు రోమాల రాజు తదితరులు ఉన్నారు.
పాపన్నపేట, ఆగస్టు 27 : సుప్రీం కోర్టు తీ ర్పును స్వాగతిస్తున్నామని మెదక్ మాజీ ఎ మ్మెల్యే శశిధర్‌రెడ్డి, స ర్పంచుల ఫోరం మండల మాజీ అద్యక్షుడు కుమ్మరి జగన్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కో ర్టు బెయిల్ మంజూరు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. కేసులో ఏ మా త్రం బలం లేకుండా సీబీఐ, ఈడీ దాదా పు 5 నెలలుగా కవితను తప్పుడు కేసు లో ఇరికించి జైలు పాలు చేయడం శోచనీయమన్నారు.
మెదక్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాజకీయ ప్రేరితమైన కేసులో న్యాయమే గెలిచిందని ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అ న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మా ట్లాడుతూ.. ఎలాంటి ఆధారాలు లేకు న్నా ఐదు నెలలు జైలులో ఉంచడం చాలా హేమమైన చర్య అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మద్దతుతో కేసులో విజ యం సాధించామని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.