నిజాంపేట, సెప్టెంబర్ 7 : నిజాంపేట మండలంలోని తిప్పనగుళ్లలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ రెడ్డి శెట్టి రవీందర్ మాతృమూర్తి సుమనమ్మ(84) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి గ్రామానికి వచ్చి.. రవీందర్‌తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం సుమనమ్మకు నివాళులు అర్పించడే కాకుండా అంత్యక్రియలో కూడా పాల్గొన్నారు.
పార్టీకోసం పనిచేసిన రవీందర్‌కు అండగా ఉంటామని తెలిపిన కంటారెడ్డి తిరుపతిరెడ్డి సుమనమ్మ పాడె మోశారు. ఈ సందర్భంగా ఆయన వెంట కల్వకుంట పీఎస్సీఎస్ అందే కొండల్ రెడ్డి, నిజాంపేట బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నాగరాజు, యూత్ మండల అధ్యక్షుడు మావురం రాజు, నాయకులు రాములు, మల్లేశం, స్వామి, నగేష్, ఎల్లం యాదవ్ తదితరులు ఉన్నారు.