మద్దూరు(ధూళిమిట్ట), మార్చి 9: నీళ్లులేక పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని సిద్దిపేట జిల్లా మద్దూరు మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు మలిపెద్ది మల్లేశం, బీఆర్ఎస్ మండల నాయకుడు సుందరగిరి పరశురాములు గౌడ్ డిమాండ్ చేశారు. మద్దూరు మండలంలోని మర్మాములలో ఎండిన పంటలను ఆదివారం వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లద్నూర్ రిజర్వాయర్‌తో పాటు చెరువు, కుంటలను నింపకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ సరఫరా అంతంతమాత్రంగానే ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యవసాయం గురించి ఏం తెలియదని, అందుకే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.