కోహెడ సెప్టెంబర్ 14: గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థ్ధాయి వరకు అంచెలంచెలుగా ఎదిగిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో గుండె,శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉద యం అతడి స్వగ్రామం సిద్దిపేట జిల్లా కోహె డ మండలంలోని శనిగరం గ్రామానికి పార్థివ దేహాన్ని తీసుకుచ్చారు. జిల్లా వ్యాప్తం గా బీఆర్ఎస్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయ న పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మండలంలో చావడ్ల వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి పలువురు నివాళులర్పించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు ఆయన చిత్రపటానికి, రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కర్ర శ్రీహరి మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, బోయినిపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, పుట్ట మధు, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొక్కుల కీర్తి, రాష్ట్ర నాయకులు పేర్యాల రవీందర్రావు, పేర్యాల దేవేందర్‌రావు, జిల్లా నాయకులు తిప్పారపు శ్రీకాంత్, ఆవుల మహేందర్, పెరుగు నరేందర్‌రెడ్డి, కర్ర రవీందర్, కర్ర భిక్షపతి ,అబ్దుల్ రహీం, బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీ నాయకులు కర్ర శ్రీహరి మృతదేహానికి నివాళులర్పించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామంలో జరిగాయి. ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, బోయిన్పల్లి వినోద్‌కుమార్, సతీశ్‌కుమార్, గంగుల కమలాకర్, దేశపతి శ్రీనివాస్ పాడె మోశారు.