చిలిపిచెడ్, ఆగస్టు 2: తల్లిపాలు బిడ్డకు అమృతంలాంటివని సూపర్వైజర్ సంతోషిమాత అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం చిలిపిచెడ్ అంగన్వాడీ-2 కేం ద్రంలో గర్భిణులు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో లభించే పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ అధికారి ప్రతిమ, ఆశ పద్మ, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేట, ఆగస్టు 2: పట్టణంలోని ఆరో వార్డు అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు పాలు, గుడ్లు అంద జేశారు. కార్యక్రమంలో ఆరో వార్డు కౌన్సిలర్ దేమె యాదగిరి, అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
రేగోడ్, ఆగస్టు 2: మండల కేంద్రంలోని సర్కారు దవాఖానలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భం గా ఐసీడీఎస్ సూపర్వైజర్ కృష్ణవేణి, డాక్టర్ శ్వేత గర్భిణులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పద్మ, కళావతి, ఆశ వర్కర్లు మరియమ్మ ,గర్భిణులు తదితర్లు పాల్గొన్నారు.