పటాన్చెరు, మార్చి 12: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో జీఎమ్మార్ వెంచర్‌లోని ఖాళీ స్థలంలో బీడీఎల్, ఓడీఎఫ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు కడీలను పాతి అక్కడే టెంట్లు వేసి కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంచర్ యజమాని మనుషులు, బౌన్లర్లతో వచ్చి ఆగ్రహంతో రాళ్ల ను కూల్చివేశారు. దీంతో బీడీఎల్, ఓడీఎఫ్ హౌసింగ్ కమిటీ సభ్యులు, వారి తాలూకా మనుషులు అభ్యంతరం వ్య క్తం చేశారు. ఆ ఘటనతో రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఒకరినొకరు తోసుకున్నారు. విష యం తెలిసిన పటాన్చెరు సీఐ వినాయక్‌రెడ్డి పోలీసు బృందాలను అక్కడికి పంపించారు.
పోలీసులు రాగా నే రెండు వర్గాల్లోని బౌన్సర్లను, సభ్యులను లాఠీలతో తరిమారు. మహిళలను, ఇతర సభ్యులను అక్కడి నుంచి పంపించి వేసి అక్కడ గొడవ జరగకుండా పహారా కాస్తున్నారు. ప్లాట్లను కబ్జాలోకి తీసుకునేందుకు ఒక వర్గం ప్రయత్నించగా, మరో వర్గం దానిని అడ్డుకున్నదని పోలీసులు తెలిపారు. తాము శాంతిభద్రతలను కాపాడేందుకు వచ్చామని పోలీసులు పేర్కొన్నారు. సర్వే నెంబర్ 162, 175, 191,206లో వేసిన వెంచర్లో తాము 2017లో 430 ప్లాట్లు సొసై టీ పేరున కొన్నామని సొసైటీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి విలేకరులకు తెలిపారు.
ఆ తర్వాత ప్లాట్లు అమ్మిన వ్యక్తులకు రూ.38కోట్లు ఒప్పందం ప్రకారం ఇచ్చామని, అప్పటి నుంచి ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆయన తెలిపారు. సొసైటీ పేరున ఒత్తిడి తెస్తే వివిధ సమయాల్లో 390 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారన్నారు. ఇంకా 40 పాట్లు సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు. వాటికోసం రెండుసార్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసినట్లు ఆయన చెప్పా రు. రెండుసార్లు ఎఫ్ఐఆర్లు అయ్యాయని తెలిపారు. 40 ప్లాట్లుగా చూపిన స్థలంలో తాము కడీలు పాతుకున్నామని, తమ ప్లాట్లలో తాముంటే బౌన్సర్లు, రౌడీలను తెచ్చి వెంచర్ నిర్వాహకులు తమపై దాడికి దిగారని సొసైటీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఆరోపించారు.