సిద్దిపేట, జూలై 7: హరితహారంలో భాగంగా సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని రంగనాయక సాగర్ వద్ద ఏర్పాటుచేసిన బొటానికల్ గార్డెన్ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. రంగనాయక సాగర్ వద్ద స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా తేజోవనం, బొటానికల్ గార్డెన్ పేరిట రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో 5000 మొకలను అటవీ శాఖ ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టు 26న అప్పటి మంత్రి హరీశ్‌రావు, జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్, విద్యార్థులు కలిసి మొకలు నాటారు. అనంతరం ఈ గార్డెన్ సంరక్షణ బాధ్యతను సిద్దిపేట మున్సిపాలిటీకి అప్పగించారు. ప్రస్తుతం బొటానికల్ గార్డెన్ నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. గార్డెన్లో మొకల కంటే పిచ్చి మొకలు ఏపుగా పెరిగాయి. కనీసం గార్డెన్లో కలుపు తీయడం లేదు. ఒకవైపు గడ్డి.. మరోవైపు పిచ్చి మొకలతో బొటానికల్ గార్డెన్ కళావిహీనంగా తయారైంది. బొటానికల్ గార్డెన్లో ఏర్పాటుచేసిన బోర్డు కూలిపోయింది. దానిని పట్టించుకోవడం లేదు. ప్రస్తు తం బొటానికల్ గార్డెన్‌ను చూసి ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట రంగనాయక సాగర్ వద్ద బొటానికల్ గార్డెన్తో పాటు మియావాకీలో కలుపు తీసే పను లు, పిచ్చిమొకల తొలిగించే పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్ర త్యేకంగా లేబర్‌ను ఏర్పాటు చేశాం. వారం రోజుల్లోగా కలుపు తీసే పనులు పూర్తిచేస్తాం. గాలి వానకు కూలిన బొటానికల్ గార్డెన్ బోర్డు ను తిరిగి ఏర్పా టు చేస్తాం.