సంగారెడ్డి, జనవరి 20: ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేక శిబిరాలను ఏ ర్పాటు చేసిందని, బీఎల్వోలు సమయపాలన పాటించి విధులకు రావాలని కలెక్టర్ వల్లూరు క్రాం తి అన్నారు. శనివారం పట్టణంలోని తారా ప్రభు త్వ డిగ్రీ కళాశాల, పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాల నిర్వహణ తీరుతెన్నులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎల్వోలు బాధ్యతగా పని చేసి ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. 18 ఏండ్లు నిండి న ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరాలు ఉద యం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నామని, అర్హులైన యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుని ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీంద్రారెడ్డి, తహసీల్దార్ ఫర్వీన్ షేక్, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు.
ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి
జహీరాబాద్, జనవరి 20: అర్హులైన ప్రతిఒకరూ ఓటరు జాబితలో పేర్లు నమోదు చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం జహీరాబాద్ మండలంలోని రంజోల్ గ్రామంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు
బీఎల్వోలు అందుబాటులో ఉండాలి
బొల్లారం, జనవరి 20: జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు ఆదివారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఆయా పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు అందుబాటులో ఉండాలని మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి ప్రకటనలో తెలిపారు.
ఓటరు నమోదు కేంద్రాల పరిశీలన
హత్నూర, జనవరి 20: హత్నూర మండలంలో నిర్వహిస్తున్న ఓటరు నమోదు ప్రక్రియను శనివారం నర్సాపూర్ ఆర్డీవో శ్రీనివాస్ పరిశీలించారు. హత్నూర, దౌల్తాబాద్, సాదుల్లానగర్ గ్రామాల్లో బీఎల్వోలు చేపడుతున్న ఓటరు నమోదును పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్య పాల్గొన్నారు.
యువత ఓటరుగా నమోదు కావాలి
18 ఏండ్లు నిండిన యువత ఓటరుగా నమోదు కావాలని, ఓటరు నమోదు ప్రక్రియను బీఎల్వోలు సక్రమంగా నిర్వహించాలని నారాయణఖేడ్ ఆర్డీవో వెంకటేశ్ అన్నారు. శనివారం మండలపరిధిలోని కృష్ణాపూర్లోని 34,35 పోలింగ్ కేంద్రాలల్లో ఓటర్ల నమోదు పక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాలశంకర్, సర్పంచ్ కృష్టారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్, బీఎల్వోలు, గ్రామ కార్యదర్శి, గ్రామస్తులు ఉన్నారు.