మునిపల్లి, మార్చి 31: ఈ బంతికి పక్కా సిక్స్.. లేదు వికెట్.. లేదులేదు.. ఈ ఓవర్లో ఐదు ఫోర్లు.. లేదా నాలుగు సిక్స్‌లు పడతాయి.. టాస్ గెలిచిన జట్టే బ్యాటింగ్ చేస్తోం ది. ఫలానా ఆటగాడు మ్యాచ్‌ను మలుపుతిప్పుతాడు అంటూ.. రూ.పది వేలు బెట్టు.. ఐపీఎల్ సీజన్ ఇలా మొదలైందో లేదో బెట్టింగులు ఊపందుకున్నాయి. గ్రామం, పట్టణం ఏదైతేనేమీ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నా యి. మార్చి 22న ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి బెట్టింగ్ రాజులకు పండుగే పండుగ.. పందెం రాయుళ్లు అడ్డాలను ఏర్పా టు చేసుకొని, ఆన్లైన్, సెల్ ఫోన్లలో వారికి తెలిసిన కోడ్ భాషల్లో బెట్టింగ్ఖు పాల్పడుతున్నారు.
మ్యాచ్ ప్రారంభం నుంచి టీవీలకు అతుక్కుపోయి బంతి బంతినీ ఉత్కంఠంగా వీక్షి స్తూ పందేలు కాస్తున్నారు. దీంతో రూ.లక్షలు చేతు లు మారుతున్నాయి. పందెం రాయుళ్లలో ఎక్కువ మంది విద్యార్థులు, యువకులే ఉన్నారని పలువురు చెబుతున్నాడు. ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభం ఉంచి గ్రామీణ, పట్టణ ప్రాం తాల్లో యువకులు, విద్యార్థులు ఎక్కువగా క్రికెట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. కొన్నేళ్లుగా టీ20 మ్యాచ్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వేసవి వచ్చిందంటే చాలు ఇండియన్ ప్రీమియం లీగ్(ఐపీఎల్)కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజూ మ్యాచ్‌లు ప్రారంభమ య్యే సమయానికి టీవీల ముందు అతుక్కుపోతున్నారు. టాస్ ప్రారంభం నుంచి బాల్ టు బాల్, పరుగులు, వికెట్లు, కొంత మంది బ్యాట్‌మెన్లపై ఎన్ని పరుగులు చేస్తారో ఈ విధంగా కూడా బెట్టిగ్లు కడుతున్నారు.
మండలంలో ఐపీఎల్ బెట్టింగ్‌లు జోరుగా కోనసాగుతున్నాయి. కొంతమంది వారికి అనువైన రీతిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. మరికొంత మంది స్నేహితులు సమూహంగా ఏర్పడి బెట్టింగులు కాస్తున్నారు. ఇంకొంత మంది క్రికెట్ ఆటపై అనుభవం గల వ్యక్తుల సాయంతో బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారం మండల కేంద్రమైన మునిపల్లితోపాటు మండలంలోని ప్రధాన చౌరస్తాలో జోరుగా జరుగుతున్నట్లు స్థానికు లు చర్చించుకుంటున్నారు.
ఆటల్లో బెట్టింగ్ రకరకాలుగా జరుగుతున్నది. కొంత మంది గ్రూపులుగా ఏర్పడి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. మరికొంత మంది పలువురి సాయంతో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. మ్యాచ్ అయిపోగానే వారివారి బెట్టింగ్‌లలో ఎవరికీ ఎవరు ఎంత ఇవ్వాలో చివరికి లెక్క చూసుకుంటున్నారు. ఒకటికి రెండు, రెండుకు మూడు రెట్లు ఈ విధంగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. వందల నుంచి లక్షల వరకు బెట్టింగ్‌లు పెడుతున్నారు.
క్రికెట్లో బెట్టింగ్‌లు వివిధ రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఒక టీం టాస్ గెలిచే విషయంలో బెట్టింగ్ పెడతారు. అదేవిధంగా ఏయే టీం ఎన్ని పరుగులు చేస్తాయి. ఏ టీం గెలుస్తుంది. ఏ బ్యాట్స్‌మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు? అనే విషయాలపై బెట్టింగ్‌లు చేస్తున్నారు. ఇవేకాక ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు. బౌలర్ బాల్ వేసే ముందు ఆ బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయి. ఈ విధంగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.
క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారు ఎక్కువగా ఆన్లైన్, సెల్ ఫోన్ల ద్వారా తమ పని కానిచ్చేస్తున్నారు. ఎవరితో బెట్టింగ్ చేయదల్చుకున్నారో వారితో ఆన్లైన్, సెల్‌ఫోన్ ద్వారా బెట్టింగ్ చేస్తున్నారు. బెట్టింగ్‌కు పాల్పడే వారు ఇతరులకు అర్థంకాకుండా కోడ్ భాషలు ఉపయోగిస్తున్నారు. కోడ్ల ప్రకారం బెట్టింగ్‌లు పెడుతున్నారు. వారు గెలిస్తే దానికి సంబంధించిన డబ్బును ఇవ్వ డం జరుగుతుంది. అంతేకాక బెట్టింగ్‌లకు పాల్పడే వారు వారి బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఉండేలా చూసుకుంటారు. బ్యాంక్ ఖాతాల్లో డబ్బు నిల్వ చూపించి ఆన్లైన్ ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.
క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా యువత ఉన్నట్లు సమాచారం. ఎక్కువగా బెట్టింగ్‌లకు పాల్పడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారని తెలుస్తోంది. కొంత మంది బెట్టింగ్‌లకు పాల్పడే వారు బంగారు ఆభరణాలను సైతం తాకట్టు పెడుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా బెట్టింగ్తో ఎంతో మంది ఆర్థికంగా చితికిపోతున్నారు. అంతేగాక మ్యాచ్‌ల సమయంలో వారి విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. గతంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లలో ఇలా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు. బెట్టింగ్ రాజులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.