శివ్వంపేట, జూలై 20: బస్సు ప్రయాణికులను ఆకట్టుకునే బస్టాప్ ఇప్పుడు శివ్వంపేటలో ఏర్పాటైంది. మండల కేంద్రంలో ఏర్పాటైన ఈ ప్రయాణ ప్రాంగణాన్ని చూస్తే ఎవ్వరైనా కాసేపు అక్కడ కూర్చుని వెళ్లాల్సిందే. అంతలా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. గతంలో శిథిలావస్థలో ఉన్న ఈ బస్టాప్ పునర్నిర్మాణం చేపట్టాలని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా, స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్‌గౌడ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారు సీఎం కేసీఆర్ సహకారంతో ఎఫ్‌డీఎస్ నుంచి రూ.10లక్షలు మంజూరు చేయించారు. జడ్పీ ఫండ్ నుంచి రూ.5 లక్షలు మంజూరు కాగా, మోడల్ బస్టాండ్ నిర్మించి చుట్టూ గ్లాసెస్, లోపల ఫ్యాన్స్, విద్యుత్ సౌకర్యం కల్పించారు. బస్టాండ్ ముందు బస్సులు నిలిపేందుకు సీసీరోడ్డు వేశారు. నూతన బస్టాండ్ నిర్మాణంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గార్డెన్ ఏర్పాటు చేస్తా..
ప్రయాణికుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సహకారంతో అత్యాధునికంగా మోడల్ బస్టాండ్ నిర్మించాం. త్వరలోనే ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రారంభిస్తాం. నూతన బస్టాండ్‌కు సొంత ఖర్చులతో ఆహ్లాదకరంగా ఉండేందుకు ఇరు పక్కల వాటర్ ఫౌంటేన్, గార్డెన్ ఏర్పాటు చేస్తాం. శివ్వంపేట మండలాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తాం.
– పబ్బమహేశ్గుప్తా, జడ్పీటీసీ, శివ్వంపేట