రామాయంపేట, మే 07 : తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయు జిల్లా శాఖ అధ్యక్షురాలు బాలమణి డిమాండ్ చేశారు. బుధవారం రామాయంపేటలోని మేడే వారోత్సవాలలో భాగంగా పారిశుధ్య కార్మికులతో కలిసి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనులు చేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మి కులందరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక జీవోను జారీ చేయాలని ఆ జీవో ప్రకారం వేతనాలు పెంచాలన్నారు.
ఈ జీవోను గ్రామాలలో పనిచేసే పారిశుధ్య కార్మికులతో బాటు మున్సిపాలిటీలలో పనులు చేసే కార్మికులకు కూడా వర్తింపజేయాలన్నారు. ఈ జీవో వల్ల కేంద్ర ప్రభుత్వం పార్ల మెంటులో కార్మికులు చేస్తున్న సమాన పనికి సమాన వేతనాలు ఇచ్చే విధంగా బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు.