దుబ్బాక టౌన్, అక్టోబర్ 4 : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు బక్కి వెంకటయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ భవనంలో ఆయన బాధ్యతలు స్వీకరించగా, మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తానని, తన పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానన్నారు. మంత్రి, ఎంపీ, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతల తెలిపారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బక్కి వెంకటయ్యకు దుబ్బాక నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రొట్టె రాజమౌళి, కౌన్సిలర్లు, ఆస యాదగిరి, ఆస స్వామి, మూర్తి శ్రీనివాస్‌రెడ్డి, పెద్ద చీకోడ్ సర్పంచ్ తౌడ శ్రీనివాస్, నాయకుడు గన్నె భూంరెడ్డి, అధికం బాలకిషన్‌గౌడ్, కొత్త కిషన్‌రెడ్డి, బానాల శ్రీనివాస్, నారాగౌడ్, మనోహర్‌రెడ్డి, గుండెల్లి ఎల్లారెడ్డి, బండిరాజు, సంజీవరెడ్డి, నగరం రవి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సద్ది రాజిరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
సిద్దిపేట టౌన్, అక్టోబర్ 4 : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బక్కి వెంకటయ్యను బీఆర్ఎస్ నేతలు సాకి ఆనంద్, బత్తుల శ్రీనివాస్, గ్యాదరి భూమలింగం, భూమయ్య, కొమురయ్య, యాదగిరి హైదరాబాద్‌లో ఆయన్ను కలిసి శుభాకాంక్షలను తెలిపారు.