సిద్దిపేట, జూలై 24 : స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చెంది సిద్దిపేట దేశానికి ఆదర్శంగా నిలవాలనేది తన కల అని, అందుకే ఈ ప్రాంత క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చానని మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట ఇండోర్ స్టేడియంలో శుక్రవారం అండర్ -13, అండర్ 15 బాలుర బాలికల బ్యాడ్మింటన్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. అండర్-13, అండర్-15 బాలురు, బాలికల బ్యాడ్మింటన్ టోర్నీ సిద్దిపేటలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, ఈ బ్యాడ్మింటన్ కోర్టు ఇంత బాగా ఉపయోగపడుతుండడం తనకు ఎం తో సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఇక్కడ రాష్ట్రానికే ఆదర్శంగా స్విమ్మింగ్ పూల్ నిర్మించామని, దీనిని పూర్తిస్థాయిలో వినియోగించుకోక పోవడం కొం త బాధగా ఉందన్నారు.
పకనే నిర్మించిన ఫుట్‌బాల్ మైదానం అద్భుతంగా ఉపయోగపడుతోందని, అకడ శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగడం చూసి ఆనందంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. బ్యా డ్మింటన్ కోర్టు ఒకటి సరిపోక పోవడంతో మరో రెండు అవసరమని క్రీడాకారులు కోరగానే, వెంటనే రూ. 50 లక్షలు మంజూరు చేయించి, మూడు నెలల్లోనే మరో రెండు కోర్టులు నిర్మించి మీకు అందించినట్లు గుర్తుచేశారు. ఆ కోర్టులను మీరు అద్భుతంగా వినియోగించుకుంటునందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో రూ.11.50 కోట్లను మంజూరు చేశామన్నారు. టెండర్లు పూర్తయ్యాయి, కాంట్రాక్టులు ఖరారైన తర్వాత, కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చి ఆ పను లు నిలిపివేసిందన్నారు. రేవంత్ ప్రభు త్వం అభివృద్ధి అడ్డుకోవడం తగదన్నారు.
ఎడ్యుకేషన్ హబ్‌గా, వాటర్ హబ్‌గా ఎదిగిన సిద్దిపేట స్పోర్ట్స్ హబ్‌గా దేశానికి ఆదర్శంగా నిలవాలన్నదే తన కల అని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాగా మారిందని, రైల్వేలైన్ ఏర్పాటైందని, గోదావరి జలాలు వచ్చాయన్నారు. ఆలయాల కేం ద్రంగా అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పు డు క్రీడల కేంద్రంగా నిలవాలని తాను కలలు కన్నానని,అందులో భాగంగానే డే అండ్‌నైట్ క్రికెట్ స్టేడియం నిర్మించామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్వి మ్మింగ్ పూల్ నిర్మించామని, మూడు షటిల్ బ్యా డ్మింటన్ కోర్టు లు, అద్భుతమైన ఫుట్ బాల్ మైదానం, వాలీబాల్, బాసె ట్ బాల్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, ఆతర్వాత మిగతా పనులు పూర్తి చేస్తామన్నారు. ఇక మీరు నాకు ఒక మాట ఇవ్వాలని, మేము మీకు ఇంత మంచి క్రీడా వేదికను ఇచ్చామని, దానికి ప్రతిఫలంగా సిద్దిపేట నుంచి ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడు, ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు ఎదగాలని హరీశ్‌రావు పిలుపునిచ్చా రు. ఈ సందర్భంగా క్రీడాకారులకు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.