నమస్తే తెలంగాణ, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ సిద్దిపేట, నవంబర్ 23 : ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేట పట్టణంలో పలుచోట్ల ప్రజలకు అందుబాటులో ఆటోమేటిక్ బీపీ చెకింగ్ మిషన్లు అందుబాటులోకి తెచ్చారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేసి ప్రత్యేకమైన సెంటర్లు ఏర్పాటు చేయించారు.
కొద్దిరోజుల పాటు బాగా పనిచేసిన ఈ సెంటర్లు, ఇప్పుడు అధికారుల పర్యవేక్షణ లోపంతో మూలనపడ్డాయి. సిద్దిపేట కలెక్టరేట్, పాత బస్టాండ్, కోమటి చెరువు నెక్లెస్ రోడ్డులో ఆటోమేటిక్ బీపీ చెకింగ్ సెంటర్లు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. దీంతో మార్నింగ్ వాకర్స్, ప్రయాణికులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.