నిజాంపేట, జూలై 13 : ఆషాడమాసం పురస్కరించుకొని నిజాంపేటలో మున్నూరు కాపు సంఘం సభ్యులు ఆదివారం మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రధాన వీధుల వెంబడి చేపట్టిన బోనాల ఊరేగింపు కనులవిందుగా జరిగింది.
అనంతరం అందరూ కలిసి మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు వెంకటేశం, మహేశ్, లక్ష్మన్, తిరుపతి, రాజు, మల్లేశం, వెంకటేశ్, సిద్ధిరాములు తదితరులు ఉన్నారు.
Protest | కస్టోడియల్ డెత్‌పై నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ నిరసన.. Video
Sircilla | సిరిసిల్లలో ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు 6 వేలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన
Nagarkurnool | తిమ్మినోనిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం