నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి/సిద్దిపేట, జూన్ 29 : ఆషాఢమాసం సందర్భంగా సంగారెడ్డిలో ఆదివారం రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు.
సిద్దిపేటలో ముత్యాల పోచమ్మ, బురుజు మైసమ్మ తల్లికి మహిళలు బోనాలు సమర్పించి సల్లంగా చూడాలని వేడుకున్నారు. పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం సామూహిక వన భోజనాలు చేశారు.