జగదేవ్పూర్ సెప్టెంబర్15: పేద ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా తోడ్పా టు అందిస్తామని చైర్పర్సన్ కాలువ సుజాత అన్నారు. ఆదివారం జగదేవ్పూర్లోని వేంకటేశ్వరాలయంలో వైశ్యసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుని వద్ద లక్షపుష్పార్చనలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలసి ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతు జగదేవ్పూర్ వేంకటేశ్వరాల యం, వైశ్య భవనానికి నిధులు మంజూరు చేయించనున్నట్లు తెలిపారు. వైశ్యులు తామ సంపాదించిన దాంటో ్లపేదలకు సహాయం చేసే గుణం ఉం టుందని అన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమి టీ చైర్మన్ నరేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, వైశ్యసంఘం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు కొం డల్, పట్టణ కార్యదర్శి అమరరామ్నివాస్, వైశ్య సంఘం జిల్లా యువజన అధ్యక్షులు చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ హరినాథ్,నాయకులు అమరరాము, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు సబిత, కార్యదర్శి జ్యోతి, కాంగ్రెస్ నాయకులు మల్లేశం,కరుణాకర్, మాజీ సర్పంచులు వెంకటయ్య, జ్యోతిమహేందర్, వైశ్యసంఘం రాష్ట్ర నాయకులు బాల్నారాయణ, బుద్ధ్దసత్యం, వొల్లాల వెంకటేశ్, గుబ్బశ్రీనివాస్ పాల్గొన్నారు.