రామాయంపేట, జూన్ 01 : అర్హులైన వారు వెటర్నరీ డిగ్రీ కోర్సులకు తమ దరఖాస్తులను అందించాలని రామాయంపేట మండల వ్యవసాయశాఖ అధికారి, డివిజన్ డీఏవో. రాజ్నారాయణ పేర్కొన్నారు. ఆదివారం రామాయంపేటలో ఆయన మాట్లాడుతూ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఆర్టికల్చర్, బీఎస్సీ వెటర్నరీ సైన్సులో డిగ్రీ కోర్సుకు సంబంధించి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఆచార్య జయశంకర్, కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన, పీవీ నరసింహారావు పశువైద్య విద్యాలయంలో ప్రవేశాలు పొందేందు కోసం ఈనెల 28 లోపు విద్యార్థులు తమ దరఖాస్తులను అందజేయాలన్నారు.