టేక్మాల్, అక్టోబర్ 22: ప్రభుత్వం నిర్దేశించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని ఏపీఎం గోపాల్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని గొల్లగూడెంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యా న్ని కొనుగోలు చేయడానికి ఐకేపీ కొనుగోలు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.
ప్రతి సీజన్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూస్తున్నామన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. దళారులకు విక్రయించి రైతులు మోసపోవద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరప్ప, రమేష్, సలీమ్, మజార్, కిషోర్, విద్యాసాగర్, ఎల్లుపేట రాజు, సిద్దిరాములు, కేశిరెడ్డి, శివాగౌడ్, రెడ్యానాయక్, తదితరులు ఉన్నారు.