చేర్యాల, ఏప్రిల్ 7: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ఈవోగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న అన్నపూర్ణకు దేవాదాయ శాఖ కమిషనర్ కొమురవెల్లి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
మల్లికార్జున స్వామిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మల్లన్న ఆలయ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో ఏఈవో బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్‌రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.